నా దగ్గర ఏముందని జరిమానా కట్టాలి?: హైకోర్టులో డేరా బాబా
- ఆస్తులన్నీ అటాచ్ చేశారు.. డబ్బు కట్టలేనన్న డేరా బాబా
- కట్టాల్సిందేనన్న హైకోర్టు
- గుర్మీత్ కు యావజ్జీవ శిక్ష విధించాలంటూ బాధితుల పిటిషన్
డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని... ఈ నేపథ్యంలో ఆయన రూ. 30 లక్షలను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. పంచకుల కోర్టు ఆదేశించిన విధంగా రెండు నెలల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లించనున్నారు. మరోవైపు, డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష సరిపోదని... యావజ్జీవ కారాగార శిక్షను విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వీరు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా పంజాబ్-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది.