'నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు.. ఇంట్లోకి రండి' అని పిలిచి, అత్యాచారానికి పాల్పడిన యువకుడు!
- వర్షంలో ఇంటి ముందు నిలబడిన మహిళను లోపలికి రమ్మన్న యువకుడు
- గిరిజన భాషలో మాట్లాడి నమ్మబలికిన వైనం
- విద్యుత్ సరఫరా నిలిపేసి, తలుపులు మూసి, అత్యాచారం
ఆమె నిల్చున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరిజన మహిళగా గుర్తించి, తాను కూడా గిరిజనుడ్నేనని చెబుతూ, వారి భాషలోనే మాట్లాడి, వర్షం తగ్గేవరకూ ఇంట్లో కూర్చుని వెళ్లిపోవచ్చని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. సొంత భాషలో మాట్లాడడంతో ఆ మేకవన్నెపులి అసలు రంగు తెలియని ఆమె ఆ ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తరువాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.