spyder: ఫ్లాప్ టాక్ వచ్చినా... రూ. 150 కోట్లు కొల్లగొట్టిన 'స్పైడర్': అధికారికంగా ప్రకటించిన నిర్మాత ఠాగూర్ మధు

  • 11 రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్
  • 12వ రోజు పోస్టర్ లో ప్రకటన
  • అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన నిర్మాత
మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, మురుగదాస్ దర్శకత్వంలో దాదాపు రెండు వారాల క్రితం విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 'స్పైడర్' కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతోంది. చిత్రం 12 రోజుల పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాతలు తమ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సంపాదించిందని అధికారికంగా ప్రకటించింది.

ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు వెల్లడించారు. 'బాహుబలి' తరువాత విదేశాల్లో అత్యధిక సెంటర్లలో 'స్పైడర్' విడుదలైన సంగతి తెలిసిందే. 11 రోజుల్లోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్ సీస్ లో 16 మిలియన్ డాలర్ల కలెక్షన్ కు చిత్రం చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నేడు ఆదివారం కలెక్షన్లు కూడా సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నారు.
spyder
mahesh babu
murugadas
collections
tagore madhu

More Telugu News