moon: ఇప్పుడంటే చంద్రుడు దూరంగా వెళ్లాడు కానీ... ఒకప్పుడు దగ్గరగానే ఉండేవాడట!

  • 3 నుంచి 4 కోట్ల సంవత్సరాల క్రిందట భూమికి దగ్గరగా చంద్రుడు
  • చంద్రుడిపై కూడా భూమిని పోలిన వాతావరణమే 
  •  2030 నాటికి చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపాలని అమెరికా సన్నాహాలు 
చందమామ మనకి బాగా దగ్గరివాడేనట!
ఇప్పుడంటే దూరంగా చిన్నగా కనిపిస్తున్నాడు కానీ, ఒకప్పుడు చంద్రుడు భూమికి బాగా దగ్గరగా ఉండేవాడట. ఇప్పుడు కనిపిస్తున్న దాని కంటే మూడు రెట్లు పెద్దగా, భూమికి మరింత దగ్గరగా వుండేవాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అచ్చం ఇప్పుడు భూమిని పోలిన వాతావరణం చంద్రుడిపై 3 కోట్ల నుంచి 4 కోట్ల ఏళ్ల క్రితం ఉండేదని నాసా జరిపిన పరిశోధనల్లో గుర్తించారు.

అప్పట్లో చంద్రుడిపై విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతాల జాడలతో ఈ విషయం తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఉపరితలంపైకి ఉబికి వచ్చిన మాగ్మాలో కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌, నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి ఆనవాళ్లే చంద్రుడిపై మనకు కనిపిస్తున్న నల్లని మచ్చలని వారు వెల్లడించారు. 2030 నాటికి చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపాలని ట్రంప్ ప్రభుత్వం నాసాను కోరినట్టు తెలుస్తోంది. 
moon
Volcano
magma
block spots

More Telugu News