Shobhaa De: గాడ్, సెక్స్ పదాలపై శోభాడే సంచలన వ్యాఖ్యలు!

  • ఈ రెండింటినీ హింసాత్మక లక్ష్యాల కోసం వాడుకుంటున్నారు
  • ప్రపంచం మాత్రం భారతీయులు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటోంది
  • గాడ్, సెక్స్.. ఈ రెండూ మూడుక్షరాల పదాలే
ప్రముఖ రచయిత్రి శోభాడే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కసౌలో జరిగిన కుశ్వంత్‌సింగ్ ఆరో ఎడిషన్ సాహితీ వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దేవుడిలానే సెక్స్ కూడా జనాలను భయపెడుతోందన్నారు. ‘గాడ్’, ‘సెక్స్’ రెండూ మూడక్షరాల పదాలేనని పేర్కొన్న శోభాడే హింసాత్మక కార్యకలాపాల కోసం ఈ రెండింటినీ ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. కామ అనేది చాలా అందమైన పదమని, కానీ, కామసూత్ర దానికి వ్యతిరేకమైన పదమని ఆమె అభిప్రాయపడ్డారు.

కొందరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ‘గాడ్’, ‘సెక్స్’ను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  శృంగారం విషయంలో భారతీయులు ఎంజాయ్ చేస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మూడక్షరాల ‘దేవుడు’ అనే పదంలానే సెక్స్ కూడా జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఈ రెండింటిని తమ హింసాత్మక లక్ష్యాల ఛేదనకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Shobhaa De
S*x
God
Khushwant Singh

More Telugu News