టీబీజీకేఎస్: టీబీజీకేఎస్ ను గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్
- కార్మికులకు ఇచ్చిన వందశాతం హామీలను నెరవేరుస్తాం
- సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేశాయి
- ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి
- కారుణ్య నియామకాలతో వారసత్వ ఉద్యోగాలు ఇస్తాం
- మీడియా సమావేశంలో కేసీఆర్
సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం 'టీబీజీకేఎస్'ను గెలిపించిన కార్మికులందరికి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ టీబీజీకేఎస్ కు భారీ మెజార్టీ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తామని, ప్రతి ఎన్నికల్లో తమను గెలిపిస్తున్న కార్మికులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రతి అంశాన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, సింగరేణి ఎన్నికల్లో అవాస్తవాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ప్రతిసారి, ‘కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది’ అని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయని ఆయన విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది వాళ్లయితే, ఆ ఉద్యోగాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించింది తమ పార్టీ అని అన్నారు. కారుణ్య నియామకాలతో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, ప్రస్తుతం ఏ అజెండా ఎత్తుకోవాలో ప్రతిపక్షాలకు తెలియడం లేదని అన్నారు.
భూ రికార్డుల ప్రక్షాళనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని, అయితే స్వయంగా గవర్నరే వెళ్లి పరిశీలించి మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. పదేపదే 'దొర' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డే అసలైన దొర అని, కులాలతో రాజకీయాలు ఎవరూ చేయలేరని కేసీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ తనపైనా, మంత్రుల పైనా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, అయితే అక్కసుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.