shashi: 8 నెలల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ

షార్ట్స్‌లో చూడండి
అక్ర‌మాస్తుల కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తోన్న శశికళకు ఐదు రోజుల‌ పెరోల్ ల‌భించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె బెంగ‌ళూరు జైలు నుంచి విడుద‌లైంది. పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను ఆమె మేనల్లుడు దినకరన్ చెన్నై తీసుకెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నై గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో శ‌శిక‌ళ త‌న భ‌ర్త‌ను ప‌రామ‌ర్శించ‌నుంది. కాగా, ఆమె సుమారు 8 నెలల నుంచి జైలులో ఉంటోన్న సంగతి తెలిసిందే. శ‌శిక‌ళ‌ తన తోడికోడలు ఇళవరసి ఇంట్లోనే ఈ ఐదు రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆమె భర్త నటరాజన్ మూత్రపిండాలు, కాలేయం వ్యాధితో చికిత్స పొందుతున్న సంగతి విదిత‌మే.    
Go Back to Shorts
shashi

More Telugu News