ఆ రోజు అతను నా చేతిలో చచ్చిఉండేవాడు: విద్యాబాలన్
- 'తుమ్హారీ సులు' సినిమా ప్రమోషన్ లో విద్యాబాలన్
- 'తుమ్హారీ సులు' సినిమాలో లేట్ నైట్ ఆర్జేగా నటిస్తున్న విద్యా బాలన్ కపూర్
- కాలేజీ రోజుల ఘటన గుర్తు చేసుకున్న విద్యాబాలన్
ఇది లేడీస్ కంపార్ట్ మెంట్, మగాళ్లకి అనుమతి లేదు, కిందికి దిగండి అని తన స్నేహితులతో పాటు తాను కూడా చెప్పానని తెలిపింది. అయితే తమ డిమాండ్ తో తరువాతి స్టేషన్ దగ్గర దిగుతానన్న ఆ వ్యక్తి, ట్రైన్ డోర్ దగ్గర కూర్చుని వికృతంగా ప్రవర్తించాడని గుర్తు చేసుకుంది. దీంతో తనకు ఒళ్లు మండిందని, తన చేతిలోని పుస్తకాలు అతనిపైకి విసిరికొట్టానని చెప్పింది. అయితే అప్పటికే రైలు తరువాతి స్టేషన్ కు చేరుకుందని తెలిపింది. లేకపోతే ఆ రోజు అతను తన చేతిలో చచ్చి ఉండేవాడని అంది.