kollywood: కోలీవుడ్ బంద్.. సినిమాలు ఆపేసిన తమిళ చిత్రసీమ

  • ధియేటర్లలో ప్రదర్శనల నిలిపివేత
  • సినిమా షూటింగ్ లు రద్దు
  • జీఎస్టీ 4 శాతానికి తగ్గించాలని డిమాండ్
కోలీవుడ్ బందైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి తమిళ చిత్రసీమ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కోలీవుడ్ మరోసారి జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టింది. వినోదపు పన్ను పేరిట భారీ మొత్తాన్ని సినిమాలపై మోపారని, జీఎస్టీని నాలుగు శాతానికి కుదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నేడు బంద్ పాటిస్తోంది. నేడు థియేటర్లతో పాటు, సినిమా షూటింగ్ లను కూడా రద్దు చేసినట్టు కోలీవుడ్ చెబుతోంది. 
kollywood
tamil movies
bandh
gst

More Telugu News