narayana college: కడప జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య!

  • నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు
  • ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని ఆత్మహత్య
  • సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్న విద్యార్థిని 
నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యాకుసుమాలు నేలరాలుతున్నాయి. కడప జిల్లాలోని కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న పావని ఆత్మహత్యకు పాల్పడింది.

నేటి తెల్లవారు జామున హాస్టల్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఆమె ఉరివేసుకుందని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 
narayana college
suicide
kadapa

More Telugu News