'సాహో' షూటింగులో జాయినైన విలన్!
- సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో'
- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్
- విలన్ గా నీల్ నితిన్ ముఖేష్
- కథానాయికగా శ్రద్ధా కపూర్
నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ - నీల్ నితిన్ తలపడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదల కానుంది. డిఫరెంట్ షేడ్స్ కలిగిన కథానాయిక పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.