ఎయిర్ టెల్: ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్!
- టెలికాం కంపెనీల మధ్య కొనసాగుతోన్న పోటీ
- ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ మరో ఆఫర్
- రూ.799తో 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా పలు ఆఫర్లు ప్రవేశపెట్టిన ఎయిర్టెల్.. తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.799తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నట్లు పేర్కొంది. జియో కూడా ఇటీవల ఇటువంటి ఆఫరే తీసుకురావడంతో పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ కూడా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఉచిత మంత్రాన్ని జపిస్తూ టెలికాం మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో అదే జోరును కొనసాగిస్తుండడంతో టెలికాం కంపెనీల మధ్య విపరీతంగా పోటీ నెలకొంది.