రూ. 96కే అన్లిమిటెడ్ డేటా.... ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో కొత్త ఆఫర్
- అన్లిమిటెడ్ డేటా రీఛార్జీ ధరలను తగ్గించిన జియో
- రూ. 149కి కూడా అపరిమిత డేటా
- 2జీబీ డేటా వాడకం తర్వాత స్పీడ్‌లో తగ్గుదల
ఈ రెండు రీఛార్జీ ప్లాన్లలోనూ కొంత డేటా వినియోగించుకున్న తర్వాత డేటా వేగం తగ్గుతుంది. రూ. 96తో రీఛార్జీ చేసుకుంటే 7 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు. కానీ 1 జీబీ పరిమితి తర్వాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్కి పడిపోతుంది. అలాగే రూ. 149తో రీఛార్జీ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్లు, 2జీబీ వరకు 4జీ వేగంతో డేటా లభిస్తుంది. 2 జీబీ వినియోగం తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.