brett lee: సచిన్ ఔట్ అయినప్పుడు వచ్చే వికెట్ల శబ్దం నాకు చాలా ఇష్టం: బ్రెట్ లీ

  • సచిన్ తో కలసి ఎన్నో మ్యాచ్ లు ఆడా
  • టెండూల్కర్ గొప్ప ఆటగాడు
  • నోబాల్ అంటే నాకు చాలా చిరాకు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై తనకున్న అభిమానాన్ని ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ మరోసారి బయటపెట్టాడు. సచిన్, తాను కలసి ఎన్నో మ్యాచుల్లో ఆడామని... తన బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే సమయంలో బంతి వికెట్లకు తగిలే శబ్దం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఆ శబ్దాన్ని తాను ఎంతో ఆస్వాదించేవాడినని తెలిపాడు. సచిన్ ఓ అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడాడు.

 ఇదే సమయంలో తన బౌలింగ్ లో అంపైర్ నోటి వెంట 'నోబాల్' అని వస్తే ఎంతో చిరాకుగా ఉండేదని చెప్పాడు. నోబాల్ అంటేనే తనకు చిరాకని తెలిపాడు. వినికిడి లోపం గల పిల్లల కోసం కేరళ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పిల్లల్ని ఉత్సాహపరిచేలా బ్రెట్ లీ మాట్లాడాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు బ్రెట్ లీ వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 310, వన్డేల్లో 380 వికెట్లను లీ పడగొట్టాడు.
brett lee
sachin tendulkar
sachin clean bowld

More Telugu News