siddhath: హారర్ థ్రిల్లర్ తో వస్తోన్న సిద్ధార్థ్!

  • త్రిభాషా చిత్రంగా 'ది హౌస్ నెక్స్ట్ డోర్'
  •  సొంత బ్యానర్ పై నిర్మిస్తోన్న సిద్ధార్థ్
  •  నాలుగేళ్ల గ్యాప్ తరువాత తెలుగులో
  •  నవంబర్లో సినిమా విడుదల        
తెలుగు .. తమిళ భాషల్లో హీరోగా సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు వుంది. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' .. 'బొమ్మరిల్లు' వంటి సినిమాలు ఆయన సహజమైన నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. వరుస పరాజయాల కారణంగా ఆయన ఇతర యంగ్ హీరోల రేసులో నిలబడలేకపోయాడు. ఫలితంగా నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. త్వరలో ఆయన 'ది హౌస్ నెక్స్ట్ డోర్' అనే హారర్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

 తన సొంత బ్యానర్ పై ఆయన ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను ఆయన ఈ సినిమాను నవంబర్లో విడుదల చేయనున్నాడు. మిళింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆండ్రియా కథానాయికగా నటించింది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమా తనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సిద్ధార్థ్ వున్నాడు.      
siddhath

More Telugu News