నెహ్రా పాస్, యువరాజ్ ఫెయిలా?... బీసీసీఐని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
- యువరాజ్ ను టీ-20 సిరీస్ కు పక్కన బెట్టిన బీసీసీఐ
- పలువురు స్టార్ ఆటగాళ్లనూ పట్టించుకోని ఎమ్మెస్కే
- సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
యువరాజ్, సురేశ్ రైనా, అశ్విన్, జడేజా, రహానే, మహ్మద్ షమీలకు ఈ జట్టులో స్థానం దక్కలేదు. ఇక పొట్టి ఫార్మాట్ లో యువరాజ్ సాధించిన రికార్డులను బీసీసీఐ మరచిపోయిందని, ఫిట్ నెస్ టెస్టులో దినేశ్, నెహ్రాలు ఎప్పుడు పాస్ అయ్యారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. యువరాజ్ ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. టీ-20లో ఎన్నో సూపర్బ్ ఇన్నింగ్స్ లను ఆడిన రైనాను పక్కన పెట్టడంపైనా బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.