ఆడపిల్లకు జన్మనిచ్చిన సోహా అలీ ఖాన్!
- ట్విట్టర్లో వెల్లడించిన భర్త కునాల్
- బాలీవుడ్ ప్రముఖుల అభినందనలు
ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, రాహుల్ ధోలాఖియా, సోఫీ చౌదరి, అలోక్ నాథ్, వివేక్ అగ్నిహోత్రి, సోనీ రజ్దాన్ వంటి చాలా మంది ప్రముఖులు కునాల్, సోహా దంపతులను అభినందించారు. సోహా గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల బేబీ షవర్ వేడుక కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సోహా అలీ ఖాన్ వదిన, కరీనా కపూర్ ఖాన్ తన కుమారుడు తైమూర్‌తో సహా హాజరైన సంగతి తెలిసిందే.