బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'జై లవ కుశ'.. తొలివారం కలెక్షన్స్ ఇవే!

  • సత్తా చాటిన 'జై లవ కుశ'
  • రూ. 135 కోట్ల వసూళ్లు
  • 'బాహుబలి-2' తర్వాత రెండో బ్లాక్ బస్టర్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మూడు విభిన్నమైన క్యారెక్టర్లతో నట విశ్వరూపం ప్రదర్శించిన జూనియర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

విజయవంతంగా ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా... 'బాహుబలి-2' తర్వాత ఈ ఏడాది రెండో బ్లాక్ బస్టర్ మూవీగా 'జై లవ కుశ' రికార్డుల్లోకి ఎక్కింది. దసరా సెలవులు, వీకెండ్ కావడంతో ఈ చిత్రం వసూళ్లు మరింత పెరుగుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
jai lava kusa
jai lava kusa collections jai lava kusa first week collections
ntr
junior ntr
box office

More Telugu News