ప్రియుడి కోసం చేయకూడని పని చేసిన యువతి... ఆపై భయంతో ఆత్మహత్య చేసుకున్న జంట!
- స్నేహితురాళ్ల నగ్న దృశ్యాలు సేకరించిన యువతి
- వాటిని ప్రియుడికి పంపిన వైనం
- విషయం వెలుగులోకి రావడంతో ఆత్మహత్య!
అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్ కు పంపి పెద్ద తప్పే చేసింది. ఈ నేపథ్యంలో వృశాలీ సెల్ ఫోన్ లో సురేష్ తో జరిగిన చాటింగ్ ను చూసిన ఓ హాస్టల్ రూమ్మేట్, మొత్తం విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సురేశ్ బలవంతం చేయడంతో తానాపని చేశానని చెప్పడంతో, ఆ మేరకు కాగితం రాయించుకున్న స్నేహితురాళ్లు, ఇకపై అతన్ని కలవరాదని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించి వదిలేశారు.
అయినా, సురేష్ తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి, సురేష్ కు విషయం చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎక్కడ పోలీసు కేసు పెడతారోనన్న భయంతో వీరిద్దరూ సమీపంలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.