టీడీపీతో ఇప్పటి వరకు ఉన్నది చాలు.. బయటకు వచ్చేయండి: ఎస్సీలకు మాల మహానాడు పిలుపు
- టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది
- ఎన్టీఆర్ హయాంలో ఎస్సీలకు కీలక పదవులు
- దళితులను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు
ఎన్టీఆర్ హయాంలో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, భారీ నీటిపారుదల శాఖలను దళితులకు కేటాయించారని... చంద్రబాబు హయాంలో దళితులకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందని చెంగయ్య అన్నారు. పొలిట్ బ్యూరో నుంచి దళిత ఎంపీ శివప్రసాద్ ను తొలగించారని చెప్పారు. కాపు సామాజిక వర్గీయుల మెప్పు కోసం మంత్రివర్గం నుంచి పీతల సుజాతను తొలగించారని అన్నారు. గిరిజన మండలికి రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ నేతలను నామినేట్ చేశారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి వల్లే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారని అన్నారు.