తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వెల్లడించిన ఆమిర్ ఖాన్... నిర్మాణానికి వెనుకంజ!
- మహాభారతంలో నటించాలని ఆమిర్ కోరిక
- కర్ణుడు, కృష్ణుడు, అర్జునుడి పాత్రలంటే ఇష్టం
- `సీక్రెట్ సూపర్‌స్టార్` ప్రచారాల్లో బిజీ
ఇటీవల `మహాభారతం` ఆధారంగా సినిమా తీయడం లేదని రాజమౌళి ప్రకటించడంతో ఆమిర్ కొద్దిగా నిరుత్సాహ పడ్డట్లు అనిపిస్తోంది. `మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్ర కర్ణుడిది. ఆ పాత్ర పోషించడానికి నా శారీరాకృతి సరిపోకపోవచ్చు. అందుకే కృష్ణుడి పాత్ర అయితే బెటర్. అందులో అర్జునుడి పాత్ర కూడా నాకు చాలా ఇష్టం. సొంత వాళ్లను చంపాల్సిన అవసరమేంటని కృష్ణుడిని ప్రశ్నించింది కేవలం అర్జునుడే` అని ఆమిర్ చెప్పారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న తన చిత్రం `సీక్రెట్ సూపర్‌స్టార్` ప్రచార కార్యక్రమాల్లో ఆమిర్ బిజీగా ఉన్నారు.