కారులో పోలీసులు.. గమనించక ఆ కారునే చోరీ చేయబోయిన దొంగ!
- జపాన్‌లోని నుమాజులో కారు చోరీ చేయాలనుకున్న దొంగ
- ముందూ వెనుకా చూసుకోకుండా రంగంలోకి దిగిన వైనం
- రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్న పోలీసులు
అయితే, ఉషియో షాటో (23) అనే ఈ దొంగ మాత్రం తాను చోరీ చేయాలనుకున్న కారులో ఎవరయినా ఉన్నారా? అన్న విషయాన్ని కూడా గమనించలేదు. తాను చోరీ చేయాలనుకున్న కారు వద్దకు మెల్లిగా వచ్చిన ఆ దొంగ.. దాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. అందులో పోలీసులు కూర్చుని ఉన్నారని, అది పోలీసుల కారని ఆ దొంగకి అప్పుడుగానీ తెలియలేదు. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. అయితే, పోలీసులు అతడిని పట్టేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు చెప్పడానికి అక్కడి పోలీసులు ఒప్పుకోలేదు.