ఇక వన్డేల్లో మనమే నంబర్ వన్... కాపాడుకోవడంపైనే అనుమానం!
- ఆస్ట్రేలియాపై 3-0 విజయంతో టాప్ పొజిషన్ కు
- రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా
- త్వరలో బంగ్లాదేశ్ తో ఆడనున్న సఫారీలు
- తదుపరి రెండు మ్యాచ్ లూ గెలిస్తే ఇండియా స్థానం పదిలం
ఆస్ట్రేలియాతో జరుగుతున్నసిరీస్ లో మిగతా రెండు మ్యాచ్ లనూ భారత్ ఓడిపోతే, దక్షిణాఫ్రికా జట్టు ఒక్క మ్యాచ్ లో గెలిస్తే తిరిగి టాప్ పొజిషన్ ను దక్కించుకుంటుంది. ఇక భారత్ మరొక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే, దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలవాల్సి వుంటుంది. ఒకవేళ ఇండియా రెండు మ్యాచ్ లూ గెలిస్తే మాత్రం 122 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు సఫారీలు బంగ్లాదేశ్ ను 2-1 తేడాతో ఓడించినా, 3-0 తేడాతో ఓడించినా, మన స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, రెండో ర్యాంకుతో భారత్ పర్యటనకు కు వచ్చిన ఆసీస్, ఇప్పుడు 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగతా మ్యాచ్ లు ఓడినా, గెలిచినా వారి ర్యాంక్ మారదు.