నోట్ల రద్దు ఓ విఫలయత్నం.. అక్కడ తప్ప ఎక్కడా విజయవంతం కాలేదు: మన్మోహన్ సింగ్
- మరోమారు సునిశిత విమర్శ చేసిన మాజీ ప్రధాని
- నాగరిక ప్రపంచంలో నోట్ల రద్దు విజయవంతం కాలేదని వ్యాఖ్య
- దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయన్న మన్మోహన్
నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నకు మన్మోహన్ బదులిస్తూ.. తానైతే అలా అనుకోవడం లేదన్నారు. చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, అయితే తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. వాటిని అధిగమించాల్సి ఉంటుందన్నారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థిక వేత్త కూడా. 1990లలో దేశంలో సంస్కరణలకు బీజం వేశారు. అందుకే ఆయనను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ రీఫామ్స్’గా అభివర్ణిస్తారు.