చంపేస్తామంటూ దావూద్ ఇబ్రహీం నుంచి కాల్స్ వచ్చాయి: అంజలి దమానియా
- సామాజిక కార్యకర్త అంజలికి బెదిరింపులు
- ట్రూకాలర్ లో దావూద్ నంబర్ అని వచ్చింది
- పోలీసులకు ఫిర్యాదు చేసిన అంజలి
తన భర్తతో చాటింగ్ చేస్తున్న సమయంలో, అర్ధరాత్రి దాటిన తర్వాత 12.33 గంటలకు ఈ ఫోన్ వచ్చిందని ఆమె తెలిపారు. ట్రూకాలర్ లో ఆ నంబర్ దావూద్ ఇబ్రహీంకు చెందనదిగా చూపించిందని చెప్పారు. ట్రూకాలర్ స్క్రీన్ షాట్ ను కూడా తీసి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.