mumbai rains: దేవుడికి మనపై ఇంత కోపం ఎందుకు?: అమితాబ్ బచ్చన్

  • మరో 24 గంటలు భారీ వర్షాలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ 
  • ఇళ్లలోనే క్షేమంగా ఉండండి
  • సూచించిన అమితాబ్ బచ్చన్
ఎడతెరిపి లేని వర్షంతో ముంబై మహానగరం అతలాకుతలమవుతున్న వేళ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. దేవుడికి మనపై కోపం వచ్చిందని వ్యాఖ్యానించారు. మరో 24 గంటల పాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన వేళ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

"దేవుడికి మనపై మరోసారి కోపం వచ్చింది. ఆయన ఉరుములు, మెరుపులతో ముంబైపై ఆగ్రహాన్ని చూపుతున్నాడు. ఇళ్లల్లోనే క్షేమంగా ఉండండి" అని ట్వీట్ చేశారు. వినాయకుడి పాదాలకు తాను మొక్కుతున్న ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఇక వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న పలువురు సెలబ్రిటీలు, తమ బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తన ఇల్లు నీటితో నిండిపోయిందని, వర్షం ఆగాలని ప్రార్థిస్తున్నానని, అప్పుడే తాను గడప దాటగలనని ఫిలిం మేకర్ శిరీష్ కుందర్ వ్యాఖ్యానించగా, దీపికా పదుకొనే, ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, ఆర్ మాధవన్ తదితరులు ప్రజలకు సూచనలు ఇస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
mumbai rains
amitab bachchan

More Telugu News