జైల్లో డేరా బాబా వృత్తి, సంపాదన వివరాలు ఇవిగో!
- సాధారణ ఖైదీగా డేరాబాబా
- డేరా బాబా వద్ద ఉన్నవి రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు మాత్రమే
- టీవీ, పత్రికలు కూడా ఇవ్వడం లేదు
- కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు
- డేరాబాబాను నైపుణ్యం లేని వాడిగా గుర్తించిన జైలు అధికారులు
- కూరగాయలు, ఎండు ద్రాక్ష సాగు పని చేస్తున్న డేరా బాబా
- రోజూ 8 గంటల శ్రమకు కూలి 20 రూపాయలు
ఆయనకు కనీసం టీవీ, పత్రికలు కూడా అందుబాటులో లేవని, ఫోన్ సౌకర్యం కూడా కల్పించలేదని ఆయన చెప్పారు. జైలులో గుర్మీత్ కు నైపుణ్యం లేని వృత్తిని అప్పగించామని చెప్పారు. దీంతో గుర్మీత్ రోజూ 8 గంటల పాటు కూరగాయలు, ఎండు ద్రాక్ష తోటల్లో పని చేస్తున్నారని చెప్పారు. ఇందుకు అతనికి రోజూ 20 రూపాయల కూలీ ముడుతుందని అన్నారు. నైపుణ్యం లేని కూలీలకు జైళ్లలో వేతనం 20 రూపాయలని ఆయన తెలిపారు. గుర్మీత్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్న దాంట్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.