ఐఫోన్ ఎక్స్ ఫీచర్లను చిన్న స్క్రీన్‌లో అందిస్తున్న ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 ప్లస్ రివ్యూ
పోర్ట్రెయిట్ మోడ్‌తో పాటు మరికొన్ని 3డీ లైటింగ్ లెవల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ త్రీడీ లెవల్ ఎఫెక్ట్స్ అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక వేగం విషయంలో ఐఫోన్ 8 ప్లస్‌కి వంక పెట్టాల్సిన అవసరం లేదు. నిజజీవితంలో త్రీడీ బొమ్మలను చూపించగల ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నిక్ ఇందులో కొత్తగా వచ్చింది. ఫేస్ ఐడీ, హోం బటన్ ఐఫోన్ ఎక్స్‌లో లేవని విమర్శిస్తున్న వాళ్లందరూ ఐఫోన్ 8 ప్లస్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఐఫోన్ ఎక్స్‌లో ఉన్న దాదాపు అన్ని రకాల ఫీచర్లను ఐఫోన్ 8 ప్లస్ అందిస్తోంది. కాకపోతే స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది అంతే!