రైళ్లలో నిద్రా సమయాల మార్పు.. రాత్రి 10- ఉదయం 6 మధ్యే నిద్ర!
- రాత్రి పది దాటిన తరువాతే పడుకోవాలి
- పగలు మధ్య బెర్త్ ఎత్తేసి పడుకుంటానంటే కుదరదు
- రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు
గతంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము 6 గంటలకు ఉన్న నిద్రా సమయాలను కుదిస్తున్నట్టు పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు నిద్రాసమయమని తెలిపింది. మిగిలిన సమయాలలో లోయర్, మిడిల్ బెర్త్ ప్రయాణికులు నిద్రపోతామని మొండికేస్తే కుదరదని తెలిపింది. అయితే అనారోగ్యంతో ఉన్నవారు, లేదా మహిళలు, వయసు పైబడిన వారి ఇబ్బందులను గుర్తించి ఇతర ప్రయాణికులు మసలుకోవాలని సూచించింది.