Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

హైదరాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్, మాదాపూర్‌, ల‌క్డిక‌పూల్‌, అమీర్ పేట్‌, బ‌షీర్‌బాగ్‌, నాంప‌ల్లి, సుల్తాన్ బ‌జార్‌, కోఠీలో భారీ వ‌ర్షం ప‌డుతోంది. హైద‌రాబాద్ శివారులోని మల్కాజిగిరి, నేరేడ్ మెట్, నాచారం, కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జవహర్ నగర్, దమ్మాయిగూడలోనూ చినుకులు ప‌డుతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో స్వ‌ల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.        
rain

More Telugu News