అందరూ చూస్తుండగా ఒక్కసారిగా వ్యాఖ్యాత బుగ్గపై ముద్దుపెట్టిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్
- తరుచూ వార్తల్లో నిలుస్తోన్న కంగనా రనౌత్
- తన కొత్త సినిమా ‘సిమ్రన్’ పబ్లిసిటీలో పాల్గొన్న ‘క్వీన్’
- తనను పొగిడిన వ్యాఖ్యాత రాఘవ్ జుయల్ వ్యాఖ్యలపై హర్షం
కంగనాని పొగిడేశాడు.
కంగనా ఓ ఆదర్శవంతమైన మహిళ అని, స్త్రీ సమస్యలపై ఆమె ఎన్నో సార్లు మాట్లాడారని, స్త్రీలు, పురుషులు సమానమని అన్నారని ఆయన అన్నాడు. కంగనా రనౌత్ పక్కన నిలబడినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని అన్నాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన కంగనా రనౌత్ ఒక్కసారిగా ఆయన బుగ్గపై ముద్దు పెట్టింది. తన తీరును ఆయన అర్థం చేసుకున్నందుకు కంగనా హర్షం వ్యక్తం చేసింది. స్టార్ ప్లస్ ఛానెల్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది.