పీవీ సింధూ ఘన విజయం... ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకున్న తెలుగు తేజం!
- 22-20, 11-21, 21-18 తేడాతో ఘన విజయం
- ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ
- గంటకు పైగా హోరాహోరీగా సాగిన పోరు
మూడో సెట్ లో ఒకుహరా చేసిన తప్పిదాలనే తనకు అనుకూలంగా మలచుకున్న సింధూ, తన కెరీర్ లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సెట్ లో సింధూ 18-16 తేడాతో లీడింగ్ లో ఉన్న వేళ, 56 షాట్ల ర్యాలీ జరుగగా, కీలక పాయింట్ సింధూ ఖాతాలో చేరి ఆమెకు 19వ పాయింట్ ను అందించింది. అదే ఉత్సాహంతో సింధూ మ్యాచ్ ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. సింధూ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూస్తున్న భారత అభిమానులు ఆఖరి పాయింట్ సాధించగానే హర్షధ్వానాలు చేశారు. ఆమె గెలుపుపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.