google: పలు సెర్చ్ వర్డ్స్ తొలగించిన గూగుల్... ఇక సమస్య రాబోదని వెల్లడి!

  • జాత్యహంకార పదాలను తొలగిస్తున్నాం
  • వెల్లడించిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రామస్వామి
  • మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే మద్దతివ్వమని స్పష్టీకరణ

సమస్యాత్మకంగా మారిన పలు పదాలను సెర్చింజన్ లో 'కీ వర్డ్స్' జాబితా నుంచి తొలగించినట్టు గూగుల్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ రామస్వామి వెల్లడించారు. జాత్యహంకారానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ గూగుల్ లో ఉండటం, వాటిని సెర్చ్ వర్డ్స్ తో కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు వెతుకుతూ ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తుండగా, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

జాతి వివక్షకు సంబంధించిన సెర్చింగ్ పదాలను తొలగించినట్టు తెలిపారు. 'వై డూ జ్యూ రుయిన్ ఎవ్రీథింగ్', 'ద ఎవిల్ జ్యూ', 'బ్లాక్స్‌ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్', 'జెవిష్ కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్' వంటి పదాలను సెర్చ్ చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ తరహా పదాలకు తాము మద్దతు పలికేది లేదని ఈ సందర్భంగా శ్రీధర్ రామస్వామి వ్యాఖ్యానించారు. జాతి విద్వేషానికి ఏ సంస్థగానీ, వ్యక్తిగానీ సహకరించరని అన్నారు.

More Telugu News