20 ఏళ్ల జైలు శిక్ష నుంచి ఉరికంబం... నేరం రుజువైతే గుర్మీత్ కు ఇదే శిక్ష!
- రెండు హత్యలపై నేటి నుంచి విచారణ
- జర్నలిస్ట్ రామ్ చందర్ ను చంపించాడని గుర్మీత్ పై అనుమానం
- డేరా మాజీ మేనేజర్ రంజిత్ మరణం వెనుకా ఆయన హస్తం
- ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఛత్రపతిని చంపించి ఆత్మహత్యగా చిత్రించారని, తన రహస్యాలను ఎక్కడ బయట పెడతాడోనన్న అనుమానంతో రంజిత్ నూ గుర్మీతే హత్య చేయించాడన్న అనుమానాలు ఎంతో కాలంగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో గుర్మీత్ పై ఇప్పటికే అభియోగాలు నమోదు కాగా, సాక్షుల విచారణ కూడా ముగిసింది. తుది వాదనలు నేటి నుంచి సాగనుండగా, డేరాలో అత్యాచారాలు, హత్యలకు సంబంధం ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించనున్నారు. ఇక హత్య కేసులో కనిష్ఠంగా యావజ్జీవం, గరిష్ఠంగా మరణదండన శిక్షలు విధించే భారత న్యాయస్థానాలు, ఈ కేసులో ఎలాంటి తీర్పును వెలువరిస్తాయన్న విషయాన్ని దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.