krishna: తమిళ హీరోను కావాల్సింది... అలా అవకాశం కోల్పోయాను: సూపర్ స్టార్ కృష్ణ

  • తమిళం మాట్లాడటం రాక చాన్స్ మిస్
  • ఇప్పుడు మహేష్ తమిళ రంగానికి పరిచయం కావడం గర్వకారణం
  • ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్న కృష్ణ
తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ, తమిళ హీరోగా పరిచయం కావాల్సివుందని, కానీ ఆ అవకాశం తప్పిపోయిందని సూపర్ స్టార్ కృష్ణ ఓ ఆసక్తికర విషయాన్ని 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఓ తెలుగు యువకుడిగా, మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే, తొలి అవకాశం తమిళ చిత్రంలోనే వచ్చిందని అన్నారు. అయితే, తనకు తమిళం మాట్లాడటం రాకపోవడంతో అవకాశం చేజారిందని, ఆపై ఆదుర్తి సుబ్బారావు 'తేనె మనసులు' చిత్రం ద్వారా తనకు చాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు మహేష్ ఎంతో అద్భుతంగా తమిళంలో డైలాగులు చెప్పడం తనకెంతో నచ్చిందని అన్నారు. మహేష్ తమిళ పరిశ్రమకు పరిచయం కావడం తనకు గర్వకారణమని చెప్పారు. ఒక్కో సినిమాకూ మహేష్ ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడని కితాబిచ్చారు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన తాను, అభిమానులు చూపే ఆదరణను మరువలేనని తెలిపారు. ఈ చిత్రం ట్రయిలర్ ఎంతో బాగుందని, చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కృష్ణ సతీమణి విజయనిర్మల మాట్లాడుతూ, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
krishna
mahesh
spyder

More Telugu News