: అమాంతం పెరిగిన పసిడి ధ‌ర‌.. తగ్గిన వెండి ధర!


కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో నిలకడ లేదు. దీని ధర ఒక్కోరోజు పెరుగుతూ.. ఒక్కోరోజు త‌గ్గుతూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు మార్కెట్లో బంగారం ధ‌ర భారీగా పెరిగింది. స్థానిక బంగారు దుకాణ‌దారుల నుంచి కొనుగోళ్లు పెర‌గ‌డంతో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.650 పెరిగి రూ.31, 000గా న‌మోదైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ రోజు 99.9 శాతం, 99.5 శాతం స్వ‌చ్ఛ‌త గ‌ల బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.31 వేలు, 30850గా ఉన్నాయి. మ‌రోవైపు వెండి ధ‌ర మాత్రం తగ్గింది. కిలో వెండి ధ‌ర‌ రూ.350 ప‌డిపోయి రూ.41,500గా న‌మోదైంది. గ్లోబ‌ల్ మార్కెట్‌లో బంగారం ధ‌ర 0.08 శాతం పెరిగి ఔన్స్ ధ‌ర 1323 డాల‌ర్ల‌కు చేరింది. 

  • Loading...

More Telugu News