: రేపు ప్రారంభం కానున్న ఏపీ ఫుడ్ ఫెస్టివల్.. నోరూరించనున్న వంటకాలు!


ఏపీ పర్యాటక శాఖ 30 రకాల వంటకాలతో రేపు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం దీని ముఖ్యోద్దేశం. సచివాలయం వేదికగా ప్రారంభం కానున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ లో లభించే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు నోరూరించనున్నాయి.

వెజటేరియన్ వంటకాలు..

బొంగు బిర్యాని,  పెస‌ర‌మొల‌క‌ల ప‌లావ్, దంపుడు బియ్యం, మెంతి కూర ట‌మోటా అన్నం, ప‌న్నీరు గంటి కుడుములు, పుల్ల‌ట్లు, రాగిముద్ద, గుత్తి వంకాయ, ఉల‌వ‌చారు, చింత‌చిగురు ప‌ప్పు, తోట‌కూర ప‌ప్పు, ఆన‌ప‌కాయ ప‌ప్పు, దొండ‌కాయ- కొబ్బ‌రి కూర, తెల‌గ‌పిండి- మునగాకు పువ్వు కూర, కాక‌ర‌కాయ ఉల్లికారం, అర‌టిపువ్వు కాంబినేష‌న్‌లో పెస‌ర‌కూర, ముక్క‌ల పులుసు, నెల్లూరు వ‌డ‌, కొబ్బ‌రి కుడుములు, కీరా వ‌డ‌, అల్లం పెస‌ర‌ట్టు, ముంత మ‌సాలా ఉన్నాయి.

నాన్ వెజిటేరియన్ వంటకాలు..
బొంగు చికెన్‌,  గోంగూర మాంసం, దోస‌కాయ మాంసం, బీర‌కాయ రొయ్య‌ల కూర‌, కొత్తిమీర కోడి మ‌సాలా, సొర పొట్టు కూర, తాటిబెల్లం ఉక్క‌రి వంటి వంటకాలు నోరూరించనున్నాయి.

  • Loading...

More Telugu News