: ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పేమీ కాదు : వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన


ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పేమీ కాదని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఉపఎన్నికల్లో 40కి పైగా సీట్లలో టీడీపీ ఓడిపోయిందని, మూడు వంతుల స్థానాల్లో డిపాజిట్లు కూడా టీడీపీ దక్కించుకోలేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో దేశమంతా తెలుసని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ గెలవాలని చంద్రబాబు మాట్లాడటం నియంత ధోరణిని తలపిస్తోందని, సీఎం చంద్రబాబుకున్న ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీల వ్యవహారాన్ని ప్రతిపక్షం నిలదీస్తుందనే భయం పట్టుకుందని అన్నారు. అందుకే, అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News