: జీఎస్‌టీ 28 శాతం ప‌న్ను శ్లాబును తొల‌గించే అవ‌కాశం?


జీఎస్‌టీ (వ‌స్తు సేవ‌ల ప‌న్ను) అమ‌ల్లోకి వ‌చ్చి రెండు నెల‌లు గ‌డిచింది. ఇందులో భాగంగా 5, 12, 18, 28 శాతం శ్లాబుల కింద వ‌స్తువుల ధ‌ర‌ల‌పై ప‌న్నులు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీటిలో 28 శాతం ప‌న్ను శ్లాబుపై తీవ్రంగా వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో దాన్ని తొల‌గించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాలుగు శ్లాబులను కూడా రెండు లేదా ఒకటికి కుదించేందుకు కేంద్రం యత్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

వీటిలో సింగిల్‌ శ్లాబ్‌ 18శాతం లేదా డ్యుయల్‌ శ్లాబ్‌ 12, 18శాతం కింద పన్నులు విధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి జీఎస్‌టీ విష‌యంలో వ‌స్తున్న వినతుల కార‌ణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో 30 వస్తువులపై పన్ను తగ్గించారు. ఖాదీభండార్లలో అమ్మే ఖాదీ వస్త్రాలపై ప‌న్ను మిన‌హాయించి, కొన్ని నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

  • Loading...

More Telugu News