: స్ఫూర్తిని నింపుతూ, కంటతడి పెట్టిస్తున్న వీడియో!


టెక్ దిగ్గజం, మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హృదయాన్ని ద్రవింపజేసిన వీడియో ఇది.  "ఇంత ఉద్వేగభరితమైన వీడియోను నేను చూడలేకపోయాను. కానీ దీన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఏ పని కూడా కష్టమైనది కాదని భావిస్తున్నా" అని ట్వీట్ చేస్తూ, ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. వేలాది మందికి స్ఫూర్తిని నింపుతూ, ఎంతో మందికి కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో ఇది.

ఇద్దరు చిన్నారులు ఓ పార్కులోని జారుడు బల్లపై ఆడుకుంటున్నారు. అందులో ఏముందని అనుకుంటున్నారా? ఓ చిన్నారి పదే పదే వేగంగా ఎక్కుతూ బల్లపై జారుతూ ఉంటే, మరో పాప చేస్తున్న ప్రయత్నమే అందరిలో లక్ష్య సాధన దిశగా స్ఫూర్తిని రగిలిస్తోంది. ఆ పాపకు రెండు కాళ్లు, రెండు చేతులూ లేవు. కానీ ఎలాగైనా మెట్లు ఎక్కి జారుడు బల్లపై నుంచి జారాలన్న ప్రయత్నంలో విజయం సాధించింది. పాప ప్రయత్నాన్ని అభినందిస్తున్న ఎందరో సెలబ్రిటీలు ఈ వీడియోను రీట్వీట్ చేస్తుండగా, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News