: రెండుసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి.. రెండుసార్లు అరెస్టయిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ పీటర్సన్‌


ఇటీవ‌లే క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్ ఈ రోజు రెండుసార్లు అరెస్ట‌య్యాడు. ఆయ‌న‌కు గోల్ఫ్ అంటే ఎంతో ఇష్టం. అయితే, ఆ ఆట‌ను ఎయిర్‌పోర్టులోనూ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. జెనీవాలోని విమానాశ్ర‌యంలో ఆయ‌న గోల్ఫ్‌ బంతిని ముందుకు ఊపాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి కొద్ది సేపు సెల్‌లో ఉంచారు. అనంత‌రం విడిచిపెట్ట‌గా ఆయ‌న లండ‌న్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులోనూ మళ్లీ గోల్ఫ్‌ బంతిని ఊపాడు. దీంతో అక్క‌డి పోలీసులు కూడా మరోసారి అదుపులోకి తీసుకుని సెల్‌లో వేశారు. త‌న‌ను పోలీసులు అరెస్టు చేశార‌ని, సెల్‌లో వేశార‌ని పీటర్సన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News