: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. విషయం తెలుసుకుని ఆయన భార్య కూడా బలవన్మరణం!


హైదరాబాద్‌లోని ఆల్విన్‌ కాలనీ ఆదిత్యనగర్‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కార‌ణంగా ఓ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో ఆయ‌న భార్య కూడా విషం తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా శివానంద గ్రామానికి చెందిన ప్రవీణ్ (32), అనిత (28) ఉద్యోగ రీత్యా హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. వారికి రెండు ఏళ్లు కూడా నిండ‌ని ఓ పాప ఉంది. అయితే, ఆ పాప‌ అమ్మమ్మ వద్ద ఉంటోంది. త‌న భ‌ర్త‌ ప్రవీణ్ ఉరి వేసుకున్నాడ‌ని గ‌మ‌నించిన అనిత‌ వైజాగ్‌లో ఉన్న త‌న‌ తమ్ముడికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పింది. అనిత తమ్ముడు హైద‌రాబాద్‌ మోతీనగర్‌లో ఉన్న త‌న స్నేహితుడు శ్రీధర్‌కు విషయాన్ని చెప్ప‌గా, అతడు.. వారి ఇంటికి వెళ్లాడు. అయితే, అప్ప‌టికే అనిత విషం తాగి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.      

  • Loading...

More Telugu News