: పెను గాలుల ఉద్ధృతికి ఫ్లోరిడాలో కుప్పకూలిన భారీ క్రేన్లు!


తమ క్రేన్లు ఎంతో బలమైనవన్నారు. 300 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచినా ఏమీ జరగదని నమ్మకంగా చెబుతూ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇర్మా హరికేన్ చూపిన ప్రభావం వారి నమ్మకాన్ని వమ్ము చేసింది. ఫ్లోరిడాలో నిర్మాణంలో ఉన్న పలు బహుళ అంతస్తుల భవంతుల వద్ద భారీ ఎత్తున నిలిపిన క్రేన్లు ఇర్మా ధాటికి పేకమేడల్లా కుప్పకూలాయి. బలమైన గాలులతో వచ్చిన ఇర్మా, మూడు ప్రాంతాల్లో నిలిపి ఉంచిన భారీ మెటల్ క్రేన్లను పడగొట్టింది.

ఈ క్రేన్లను తొలగించాలని గతవారంలో అధికారులు కోరిన వేళ, ఇవి బలమైనవని, వీటిని తీయాల్సిన అవసరం లేదని నిర్మాణ సంస్థలు చెప్పాయి. కానీ, ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. క్రేన్లు కుప్పకూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, తుపాను ప్రభావం తగ్గిన తరవాత ఇవి కూలిన కారణాన్ని విచారిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఈ క్రేన్ల యాజమాన్య సంస్థ ది రిలేటెడ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ పెరేజ్ మాట్లాడుతూ, క్రేన్లు పడిపోవడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇకపై మరింత భద్రతతో కూడిన క్రేన్లను తయారు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News