: ఓ వైపు నుంచి మంటలు దూసుకొస్తోంటే.. మరోవైపు కూల్ గా ఆడుకున్నారు.. ఫొటోలు వైరల్!
ఓ వైపు నుంచి మంటలు దూసుకొస్తోంటే కొందరు వ్యక్తులు మరోవైపు కూల్ గా ఆడుకుంటోన్న సంఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పోర్ట్లాండ్‌లోని కొలంబియా నది గుండా ఉన్న అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేస్తోంది. ఆ మంటల ధాటికి ఇప్పటికే 33, 400 ఎకరాల అటవీ సంపద కాలి బూడిదై పోయింది. తాజాగా బెకాన్ రాక్ గోల్ప్ కోర్స్ వైపు ఆ కార్చిచ్చు దూసుకొచ్చింది. అయితే, అందులో గోల్ఫ్ ఆడుకుంటోన్న కొందరు వ్యక్తులు.. ఓ వైపు మంటలు వస్తుండగా మరోవైపు ఇలా తమ ఆట ఆడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.