: విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా... వీడియో చూడండి!
తమ పాఠశాలలో జరుగుతున్న చిన్న అంతర్గత సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవడంతో విద్యార్థులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వాషింగ్టన్‌లోని మెక్‌కిన్లీ టెక్ స్కూల్‌లో కొత్త విద్యాసంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు స్వాగతం పలికే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒబామా వస్తున్న విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు చెప్పలేదు. దీంతో తమ సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా ఒబామా రావడంతో విద్యార్థులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. వాళ్లు ఆశ్చర్యపోతున్న వీడియోను ఒబామా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.