: వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: టి.సుబ్బరామిరెడ్డి


కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి తాను వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు. తాను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. కన్న తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఎన్నో పదవులు పొందిన తాను పార్టీ మారితే ప్రజలు హర్షించరని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం కూడా అనుమానమే అని చెప్పారు.

 విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ సరైన అభ్యర్థిని బరిలోకి దింపలేదని అన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ ప్రైవేటీకరణ కాకుండా రక్షిస్తామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ పై కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈనెల 17వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటి జమునకు సన్మానం చేయనున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News