: రష్యా న్యూస్ ఛానెళ్లలో సంచలన వార్త.. బయటకు వెళ్లాలంటే భయపడుతున్న మహిళలు!
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఓ వార్త ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. మాస్కో సమీపంలోని ఒక పట్టణంలో నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్కడికి చేరుకున్న పోలీసు, మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. ఎందుకంటే... వివస్త్రగా పడి ఉన్న ఆమె శరీర భాగాలను కత్తితో కోసేశారు. ఆ శవం పక్కనే సర్జన్ వినియోగించే గ్లౌజులు ఉన్నాయి. దీంతో నైపుణ్యం కలిగిన వైద్యుడే ఈ అరాచకానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. 'ఈ హత్యను మానవ మాంసం కోసం చేశారని, మానవ మృగం తిరుగుతోందని, జాగ్రత్తగా ఉండాలని' హెచ్చరికల వార్తలు ప్రసారం కావడంతో యువతులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ప్రభుత్వం నియమించింది.