: క్రీడా రంగంలోకి బాలీవుడ్ భామ... కొత్త ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన సన్నీ లియోన్!


సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, రణ్ బీర్ కపూర్ వంటి వారి సరసన బాలీవుడ్ భామ సన్నీలియోన్ కూడా నిలిచింది. వీరందరికీ వివిధ క్రీడలకు సంబంధించన లీగ్స్ లో సొంత ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఇంకొందరు ప్రములు వీరితో భాగస్వాములుగా ఉన్నారు. అయితే బాలీవుడ్ అందాలతారగా పేరుతెచ్చుకున్న సన్నీలియోన్ ఇప్పటికే ఫ్రాగ్రెన్స్ (సెంట్ల) రంగంలో ప్రవేశించి సత్తా చాటుతోంది. ఈ రంగంలో భారత్ లో పెద్ద బ్రాండ్లకు సవాలు విసురుతోంది. తాజాగా ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ లో ఫ్రాంఛైజీని కొనుగోలు చేసి, క్రీడారంగంలో అడుగుపెట్టింది. ఫుట్సల్ అంటే ఇండోర్ స్టేడియంలో ఆడే ఫుట్ బాల్ ఆట.

 కేవలం ఐదుగురు ఫుట్ బాల్ క్రీడాకారులు మినీ స్టేడియంలో నిబంధనల మధ్య ఫుట్ బాల్ ఆడడమే ఫుట్సల్. ఈ ఆటలో ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడం ద్వారా క్రీడారంగంలో అడుగుపెడుతోంది. కోచి కేంద్రంగా కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రీమియర్ ఫుట్సల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఒక సీజన్ పూర్తయింది. రెండో సీజన్ సెప్టెంబర్ 15న ముంబైలో ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగుతుంది. రెండో‌ రౌండ్ బెంగళూరులో సెప్టెంబర్ 19 నుండి 24 వరకు జరుగుతాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ లు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 1 వరకు దుబాయ్‌ లో జరుగుతాయి. కాగా, కేరళలో సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ ఈ మధ్య షాప్ ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు బయటపడ్డ సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News