: గుర్మీత్ డేరాలో రెండు గదుల నిండా కరెన్సీ నోట్లు, ఓ గది నిండా మారణాయుధాలు... విస్తుపోతున్న పోలీసులు!


సిర్సాలోని గుర్మీత్ రామ్ రహీమ్ డేరాలో ఈ ఉదయం నుంచి సోదాలు జరుపుతున్న పారా మిలటరీ బలగాలు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తుపోయేలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి మరీ డేరాలో సోదాలు జరుపుతున్న పోలీసులకు రెండు గదుల నిండా కొత్త కరెన్సీ లభించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరో గది నిండా మారణాయుధాలు బయటపడ్డాయని, గుర్మీత్ తో దందాలు నడిపించిన వారి వివరాలతో కూడిన హార్డ్ డిస్క్ లను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాన్ని ఫోరెన్సిక్ టీమ్ కు పంపించారని సమాచారం.

కొన్ని గదులను సీజ్ చేసిన పోలీసులు, ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ టీమ్ సమక్షంలోనే వాటిని తెరవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిర్సా ప్రాంతంలో అలజడులు చెలరేగకుండా ఇప్పటికే 41 పారా మిలిటరీ బలగాలు కాపలా కాస్తున్నాయి. ఓ స్వాట్ టీమ్, ఓ డాగ్ స్క్వాడ్ డేరాలో సోదాల్లో పాలు పంచుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News