ntr: 'జై లవకుశ'లో ట్విస్టులే ట్విస్టులట!

కొన్ని పరాజయాలు పలకరించినంత మాత్రాన రచయితగా కోన వెంకట్ సామర్ధ్యాన్ని తక్కువగా చేసి చూడలేం. ఆసక్తికరమైన .. అనూహ్యమైన విధంగా స్క్రీన్ ప్లే ను అందించడం ఆయన ప్రత్యేకత. 'జై లవ కుశ' విషయంలోనూ ఆయన అదే చేశాడట. ఈ సినిమాలోని మూడు పాత్రలను ఇప్పటికే పరిచయం చేశారు.

ఒక పాత్రలో విలన్ ఛాయలు కనిపిస్తే .. మరో పాత్ర సాఫ్ట్ గా పలకరించింది. అయితే విలన్ ఛాయలున్న పాత్ర చివరిలో హీరోగా నిలుస్తుందనీ .. సాఫ్ట్ గా కనిపించే పాత్ర విలన్ గా టర్న్ అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇలా ఎన్నో ట్విస్టులతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో .. కోన వెంకట్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో చూడాలి. సినిమా విడుదల దగ్గర పడుతుండగా వచ్చిన ఈ టాక్ .. మరింతగా అంచనాలు పెంచే అవకాశం వున్నట్టుగా అనిపిస్తోంది.  
ntr
rasi khanna

More Telugu News